ED: ఫెమా నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు... అమెజాన్ ఇండియా హెడ్ కు ఈడీ సమన్లు

ED issues notices to Amazon India head Amit Agarwal
  • ఫ్యూచర్ గ్రూప్, అమెజాన్ మధ్య ఒప్పందం
  • అవకతవకలు జరిగినట్టు భావిస్తున్న ఈడీ
  • వచ్చే వారం విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు
  • నోటీసులు అందాయన్న అమెజాన్ ఇండియా

గతంలో ఫ్యూచర్ గ్రూప్ తో ఒప్పందంలో ఫెమా (విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం) నిబంధనలు ఉల్లంఘించినట్టు అమెజాన్ ఇండియా విభాగంపై తీవ్ర ఆరోపణలు రావడం తెలిసిందే. దీనిపై విచారణ జరుపుతున్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా అమెజాన్ ఇండియా హెడ్ అమిత్ అగర్వాల్ కు నోటీసులు జారీ చేసింది. వచ్చే వారం తమ ముందు హాజరు కావాల్సి ఉంటుందని ఆ నోటీసుల్లో స్పష్టం చేసింది. ఫ్యూచర్ గ్రూప్, అమెజాన్ ఇండియా ఒప్పందంలో అవకతవకలు జరిగినట్టు ఈడీ భావిస్తోంది.

కాగా ఈడీ నుంచి నోటీసులు అందాయని అమెజాన్ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. నోటీసులను పరిశీలించి తమ స్పందన తెలియజేస్తామని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News