రూ.30 లక్షల వరకు ఖర్చయ్యే బోన్ మ్యారో మార్పిడి చికిత్స ఉచితంగా అందజేస్తున్నాం: హరీశ్ రావు
- ఖరీదైన వ్యవహారంగా బోన్ మ్యారో మార్పిడి
- పేదలకు అందని చికిత్సగా ఉన్న ఎముక మజ్జ మార్పిడి
- ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా అందిస్తున్నట్టు హరీశ్ వెల్లడి
- ఒక్క తెలంగాణలోనే ఫ్రీ అంటూ వివరణ
అయితే, తెలంగాణ ప్రభుత్వం ఎముక మజ్జ మార్పిడిని ఆరోగ్య శ్రీ పరిధిలో చేర్చింది. దీనిపై మంత్రి హరీశ్ రావు వివరణ ఇచ్చారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రభుత్వ వైద్య రంగం అద్భుత ఫలితాలు సాధిస్తోందని తెలిపారు. రూ.30 లక్షల వరకు ఖర్చయ్యే బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స ను ఆరోగ్య శ్రీ కింద నిమ్స్ లోనూ, ఎంఎన్ జే క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ ఆసుపత్రిలోనూ ఉచితంగా అందిస్తున్నారని వెల్లడించారు.
బోన్ మ్యారో మార్పిడి చికిత్సను పేదలకు ఉచితంగా అందిస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటేనని హరీశ్ రావు ఉద్ఘాటించారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో లభించే వైద్య సౌకర్యాలు సామాన్యులకు కూడా ప్రభుత్వ వైద్య రంగంలో అందుతున్నాయని వివరించారు.