Jagan: గాల్లో వస్తాడు, గాల్లో పోతాడు అన్నారు.. చంద్రబాబు సంస్కారానికి నమస్కారం: జగన్

Jagan fires on Chandrababu
  • వరద సహాయక చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నా
  • నేను పర్యటనకు వెళ్తే అధికారుల దృష్టి నామీదే ఉంటుంది
  • వరద బాధితుల పరామర్శకు వెళ్లిన చంద్రబాబు అసలు విషయాన్ని వదిలేశారు
టీడీపీ అధినేత చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. తాను ఎప్పటికప్పుడు వరద సహాయక చర్యలను సమీక్షిస్తున్నానని... వరద ముంపు ప్రాంతాల్లో తాను ఏరియల్ సర్వే నిర్వహించానని ఆయన తెలిపారు. తాను వరద బాధితుల కోసం పర్యటనకు వెళ్తే... అధికారుల దృష్టంతా తనపైనే ఉంటుందని... అందువల్ల అక్కడ పనులు జరగవనే ఉద్దేశంతోనే అక్కడకు వెళ్లలేదని చెప్పారు.

అయినా చంద్రబాబు తనపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. జగన్ గాల్లోనే వచ్చాడు, గాల్లోనే వెళ్లాడని అన్నారని... వైయస్ కూడా కాలగర్భంలో కలిసిపోయారని అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. చంద్రబాబు సంస్కారానికి నమస్కారమని అన్నారు. వరదబాధితులను పరామర్శించేందుకు వెళ్లిన చంద్రబాబు అసలు విషయాన్ని వదిలేసి... ఇలాంటి మాటలు మాట్లాడటమేంటని ప్రశ్నించారు.
Jagan
YSRCP
Chandrababu
Telugudesam

More Telugu News