Sharmila: నీ కాలర్ పట్టుడు పక్కా.. నీ అధికారానికి నిప్పు పెట్టుడు పక్కా: వైఎస్‌ ష‌ర్మిల

sharmila slams kcr
  • తిరగబడ్డడు రైతన్న
  • వ‌డ్ల‌కు నిప్పు పెట్టాడు
  • వడ్లు కొన‌కుండా రైతు మీద సర్కారు పగపడుతోంది
  • కేసీఆర్ వడ్లు కొనకపోతే రైతులు తిర‌గ‌బ‌డ‌తారు
'తిరగబడ్డడు రైతన్న' అంటూ వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల తెలంగాణ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పించారు. వ‌న‌ప‌ర్తి జిల్లా పెద్ద‌మంద‌డిలో వ‌డ్ల‌కు నిప్పు పెట్టిన రైతుల ఫొటోను ఆమె పోస్ట్ చేశారు. 'వడ్లు కొన‌కుండా రైతు మీద సర్కారు పగపడుతుంటే, తరుగు పేరిట మిల్లర్లు దోచుకుంటుంటే, కొంటారో కొనరో తెలియక రైతు గుండెలు ఆగిపోతుంటే, ఎవడు చస్తే నాకేంటని సర్కారు చేతులెత్తేస్తే, కేసీఆర్ ధాన్యం కొనక రాజకీయాలు చేస్తుంటే.. తిరగబడ్డడు రైతన్న' అని ష‌ర్మిల పేర్కొన్నారు.

'ఆగ్రహించిన రైతన్న చేతకాని సర్కార్ తీరుకు పంటను తగలబెట్టుకొంటుండు! ఆత్మహత్య చేసుకుంటుండు! దొరా.. నువ్వు పంట కొననని చెప్పినా, రైతులతో కాళ్లు మొక్కించుకున్నా, పంటను కొనకుండా రైతులతో పంటను తగలబెట్టేలా చేసినా, నువ్వు వడ్లు కొనకపోతే నీ కాలర్ పట్టుడు పక్కా. నీ అధికారానికి నిప్పు పెట్టుడు పక్కా' అని ష‌ర్మిల హెచ్చ‌రించారు.
Sharmila
YS Sharmila
YSRTP

More Telugu News