న్యాయం కోసం.. అత్తారింటి మెట్లపైనే 4 రోజులుగా కోడలు పూజలు.. వీడియో ఇదిగో
- ఒడిశాలో ఘటన
- ప్రేమించి పెళ్లి చేసుకుని మోసం చేసిన భర్త
- ఇంటి నుంచి పారిపోయాడన్న బాధితురాలు
- అత్తారింటి ముందే నిరసనగా లక్ష్మీ దేవికి పూజలు
ఒడిశాలోని బరంపురంలోని బ్రహ్మనగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. మార్గశిర గురువారం నేపథ్యంలో నిన్న ఆమె సంప్రదాయ వస్త్రాలు ధరించి మెట్లపైనే పండ్లు, ఫలహారాలు పెట్టింది. అక్కడే లక్ష్మీదేవికి పూజలు చేసి, మీడియాతో మాట్లాడింది. ఆమెకు మహిళా సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. తనకు న్యాయం జరిగే వరకు తన పోరాటాన్ని కొనసాగిస్తానని బాధితురాలు చెబుతోంది.