Andhra Pradesh: మంత్రి కొడాలి నాని, ముగ్గురు ఎమ్మెల్యేలకు భద్రత పెంపు

AP Govt Increase security to minister kodali nani and three MLAs
  • అసెంబ్లీలో ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం
  • సామాజిక మాధ్యమాల ద్వారా బెదిరింపులు
  • నానికి అదనంగా 1+4 భద్రత
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో మంత్రి కొడాలి నానితోపాటు ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి ప్రభుత్వం అదనపు భద్రత కల్పించింది. అసెంబ్లీలో జరిగిన పరిణామాల తర్వాత సామాజిక మాధ్యమాల ద్వారా బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో భద్రతను మరింత పెంచినట్టు ఈ సందర్భంగా ప్రభుత్వం తెలిపింది.

మంత్రి నానికి ఇప్పటికే 2 ప్లస్ 2 భద్రత ఉండగా అదనంగా 1 ప్లస్ 4 భద్రత కల్పించింది. అలాగే, ఆయన కాన్వాయ్‌లో అదనంగా మరో భద్రతా వాహనాన్ని కేటాయించారు. ఎమ్మెల్యేలకు అదనంగా 3 ప్లస్ 3 గన్‌మన్లతో భద్రత కల్పించారు.
Andhra Pradesh
Kodali Nani
Telangana Assembly
Security

More Telugu News