Revanth Reddy: పైత్యం పరాకాష్ఠకు చేరింది: రేవంత్ రెడ్డి

Revanth Reddy condemns TRS decision to establish KCR statue
  • సిద్ధిపేటలో కేసీఆర్ విగ్రహ ఏర్పాటుపై వివాదం
  • టీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న కాంగ్రెస్ వర్గాలు
  • ఈ ధోరణిని ఖండిస్తున్నామన్న రేవంత్
  • అడ్డుకున్న కాంగ్రెస్ వర్గాలకు అభినందన

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ నేతలపై విమర్శలు చేశారు. టీఆర్ఎస్ నేతల పైత్యం పరాకాష్ఠకు చేరిందని వ్యాఖ్యానించారు. సిద్ధిపేట ప్రజల సెంటిమెంట్ ను అవమానపరిచేలా గడి మైసమ్మ లాల్ కమాన్ పై కేసీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని టీఆర్ఎస్ నేతలు ప్రయత్నించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోందని తెలిపారు.

ఇలాంటి విపరీత ఆలోచనలు మానుకోవాలని టీఆర్ఎస్ నేతలకు హితవు పలికారు. లాల్ కమాన్ పై కేసీఆర్ విగ్రహం పెట్టనివ్వకుండా అడ్డుకున్న కాంగ్రెస్ నాయకులను అభినందిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News