కరోనా తర్వాత మారిన పద్ధతి.. ఆన్లైన్లోనే అప్పు తీసుకుంటున్న యువత
- కరోనా రెండో దశ తర్వాత ఆన్లైన్ రుణాల పెరుగుదల
- సర్వే నిర్వహించిన ‘హౌ ఇండియా బారోస్’
- కరోనా ప్రభావం నుంచి వేగంగా కోలుకున్న హైదరాబాద్, బెంగళూరు
ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు సహా 9 నగరాల్లో ఈ సంస్థ సర్వే నిర్వహించింది. కరోనా నేపథ్యంలో గతేడాది దాదాపు 85 శాతం మంది ఇంటి ఖర్చుల కోసం రుణాలు తీసుకోగా, ఈ ఏడాది 4 శాతం మాత్రమే అప్పు తీసుకున్నట్టు సర్వేలో వెల్లడైంది. ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడడమే ఇందుకు కారణమని సర్వే సంస్థ పేర్కొంది.
సర్వేలో పాల్గొన్న 21-45 ఏళ్ల మధ్య వయస్కుల్లో 40 శాతానిపైగా ఆన్లైన్లో రుణాలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. కొత్త వ్యాపారాల ప్రారంభం, ఉన్న వ్యాపారాల విస్తరణ, ఆరోగ్య అత్యవసరాలు, వాహనాల కొనుగోలు, వివాహం, విద్య తదితర వాటికోసం రుణాలు తీసుకున్నట్టు సర్వేలో వెల్లడైంది. కొవిడ్ ప్రభావం నుంచి హైదరాబాద్, బెంగళూరు వేగంగా కోలుకున్నట్టు సర్వే వివరించింది.