Chandrababu: ఆ మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలంటూ.. ఏపీ వ్యాప్తంగా టీడీపీ ఆందోళనలు!

TDP takeup statewide protests against YSRCP comments on Chandrababu
  • తన భార్య గురించి దారుణంగా మాట్లాడారంటూ విలపించిన చంద్రబాబు  
  • నేడు నందమూరి కుటుంబ సభ్యుల తీవ్ర స్పందన  
  • కళ్లకు గంతలు కట్టుకుని టీడీపీ శ్రేణుల నిరసన  
నిన్న అసెంబ్లీలో వైసీపీ నేతలు తన భార్య గురించి దారుణంగా మాట్లాడారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు వాకౌట్ చేయడం, తదనంతరం ప్రెస్ మీట్ లో విలపించడం ప్రకంపనలు రేపుతోంది.
దీనిపై ఈరోజు నందమూరి కుటుంబ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా స్పందించారు కూడా.

మరోపక్క, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలను చేపట్టాయి. అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రులను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో మాజీ ఎమ్మెల్యే నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపాయి. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణను పోలీసులు గృహనిర్బంధం చేశారు.
Chandrababu
Telugudesam

More Telugu News