Shalu Chaurasia: సినీ నటి చౌరాసియాపై దాడి కేసులో పురోగతి

Police advances in Chaurasia case
  • కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తుండగా చౌరాసియాపై దాడి
  • నటి ఆపిల్ ఫోన్ ను ఎత్తుకెళ్లిన వైనం
  • కేసు నమోదు చేసుకున్న పోలీసులు
  • శాస్త్రీయ విధానంలో కేసు దర్యాప్తు
హైదరాబాదులో నటి షాలు చౌరాసియాపై దాడి చేసి ఆమె ఆపిల్ ఫోన్ ను ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో చౌరాసియాకు గాయాలయ్యాయి. ఈ ఘటనను సవాల్ గా తీసుకున్న పోలీసులు దర్యాప్తులో పురోగతి సాధించారు. నిందితుడిగా భావిస్తున్న బాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

చౌరాసియా ఆదివారం రాత్రి బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ వద్ద వాకింగ్ చేస్తుండగా ఆమెపై దాడి జరిగింది. అయితే సీసీ కెమెరా ఫుటేజిలో ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు శాస్త్రీయ పంథాలో ముందుకెళ్లాలని నిర్ణయించారు. కృష్ణా నగర్, వెంకటగిరి, యూసఫ్ గూడ ప్రాంతాల్లో నేరచరిత్ర ఉన్నవారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారిలో సినీ కార్మికులుగా పనిచేస్తూ క్రిమినల్ రికార్డు కలిగివున్న వాళ్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, పోలీసుల అదుపులో ఉన్న బాబు కృష్ణా నగర్ వాసిగా భావిస్తున్నారు. షాలు చౌరాసియా పలు తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు.
Shalu Chaurasia
Attack
KBR Park
Hyderabad

More Telugu News