Madhusudhana Chary: గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారిని ఖరారు చేసిన కేసీఆర్

KCR finalises Madhusudhana Chary as Governor quota MLC
  • రాజ్ భవన్ కు ఫైలును పంపిన కేబినెట్
  • కాసేపట్లో గవర్నర్ సంతకం చేసే అవకాశం
  • గతంలో కౌశిక్ రెడ్డి పేరును ప్రతిపాదించిన ప్రభుత్వం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మధుసూదనాచారి పేరును ఆయన ఖరారు చేశారు. ఈ మేరకు రాజ్ భవన్ కు తెలంగాణ కేబినెట్ ప్రతిపాదన పంపింది. ఈ ఫైల్ పై గవర్నర్ తమిళిసై సంతకం చేస్తే ఆయన ఎమ్మెల్సీ అయిపోతారు. ఈ మధ్యాహ్నంలోగానే ఈ ఫైల్ పై గవర్నర్ సంతకం చేస్తారని తెలుస్తోంది.

కాగా, ఇంతకుముందు కౌశిక్ రెడ్డి పేరును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఫైలును గవర్నర్ తమిళిసై పెండింగ్ లో పెట్టారు. దీంతో, గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారిని ప్రభుత్వం ప్రతిపాదించింది. మధుసూదనాచారి గతంలో అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన సంగతి తెలిసిందే.
Madhusudhana Chary
MLC
Governor Quota
KCR

More Telugu News