Telugudesam: పెట్రోల్, డీజిల్ ధరలు, కరెంట్ చార్జీలు ఏపీలోనే అత్యధికం: చంద్రబాబు

Chandrababu Reaches Assembly On Foot
  • అసెంబ్లీకి కాలినడకన వెళ్లిన టీడీపీ అధినేత
  • నిత్యావసరాల ధరలతో జనం ఉక్కిరిబిక్కిరి
  • చెత్తపై పన్ను వేసిన చెత్త ప్రభుత్వమంటూ మండిపాటు
ఏపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటోందని ఆరోపిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నేతృత్వంలో.. పార్టీ ఎమ్మెల్యేలు పాదయాత్రగా అసెంబ్లీకి వెళ్లారు. పెరిగిన ధరలపట్ల ప్రభుత్వంపై నిరసన తెలిపారు. బ్యానర్ పట్టుకుని వెళ్లారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. చెత్తపై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం అంటూ మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

పెట్రోల్, డీజిల్ ధరలు, కరెంట్ చార్జీల్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా వసూలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగి.. జీవన ప్రమాణాలు పడిపోయే స్థితికి వచ్చిందని విమర్శించారు. పెరిగిన పన్నుల భారం, ధరాభారంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు.
Telugudesam
Andhra Pradesh
Chandrababu
AP Assembly Session

More Telugu News