Telangana: తెలంగాణలో మద్యం దుకాణాలకు పోటెత్తిన దరఖాస్తులు

  • మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించిన ప్రభుత్వం
  • నిన్న ఒక్క రోజే 15 వేల దరఖాస్తులు
  • నేడు మరో 30 వేల దరఖాస్తులు వచ్చే అవకాశం
15 thousand applications received in telangana for liquor shops till now

తెలంగాణలో మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించగా ఆశావహులు పోటెత్తారు. నిన్న ఒక్క రోజే ఏకంగా 15 వేల దరఖాస్తులు వచ్చాయి. వీటితో కలుపుకుని ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య 29 వేలకు చేరుకుంది. చివరి రోజైన నేడు మరో 30 వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ. 2 లక్షల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఇది నాన్ రిఫండబుల్. దుకాణం వచ్చినా, రాకున్నా ఈ ఫీజును వదులుకోవాల్సిందే. ఫలితంగా దరఖాస్తుల ద్వారానే ఏకంగా రూ. 1200 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా, దరఖాస్తు స్వీకరణ గడువు నేటితో ముగియనుండగా, దీనిని పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News