Andhra Pradesh: చంద్రబాబును సొంత నియోజకవర్గ ప్రజలే నమ్మలేదు: విజయసాయిరెడ్డి

Vijayasai Reddy Responded On Kuppam Muncipal Results
  • కుప్పం ఫలితాలపై స్పందన
  • టీడీపీ కుప్పం కోట బద్దలైందని కామెంట్
  • ఇప్పటికే మెజారిటీ స్థానాలు సాధించిన వైసీపీ
కుప్పంలో అత్యధిక స్థానాలను గెలవడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. టీడీపీ కుప్పంకోట బద్దలైందన్నారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ జయభేరి మోగించిందన్నారు.

దీన్ని బట్టి రాష్ట్రంలోని ప్రజలతో పాటు ఎన్నో ఏళ్లుగా గెలిపిస్తున్న ఆయన సొంత నియోజవకర్గంలోని ప్రజలే బాబును నమ్మలేదని ఈ ఫలితాలతో అర్థమైందని అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ లో భాగంగా ఇప్పటిదాకా వెల్లడైన ఫలితాల్లో వైసీపీ 15 స్థానాల్లో విజయకేతనం ఎగరేసి చైర్ పర్సన్ పదవిని ఖరారు చేసుకున్న సంగతి తెలిసిందే.
Andhra Pradesh
YSRCP
Vijay Sai Reddy
Kuppam
Telugudesam
Chittoor District

More Telugu News