Prabhas: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Radhe Shyam Hindi version to be released in a record level
  • 'రాధేశ్యామ్' రికార్డు స్థాయిలో రిలీజ్ 
  • విజయ్ సినిమాకు తమన్ మ్యూజిక్
  • ఓటీటీకి వచ్చేస్తున్న 'రొమాంటిక్'
*  ప్రభాస్, పూజ హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రాధేశ్యామ్' చిత్రం హిందీ వెర్షన్ ను ఉత్తరాదిన రికార్డు స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం 3500 స్క్రీన్స్ ను ఇప్పటికే లాక్ చేసినట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 14న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తారు.
*  తమిళ సూపర్ స్టార్ విజయ్ తొలిసారిగా ఓ తెలుగు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జోరుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో చిత్ర సంగీత దర్శకుడిగా తమన్ ను ఎంచుకున్నట్టు తాజా సమాచారం.
*  ఆకాశ్ పూరి, కేతిక శర్మ జంటగా  అనిల్ పాదూరి దర్శకత్వంలో రూపొందిన 'రొమాంటిక్' చిత్రం ఇటీవలే థియేటర్లలో రిలీజ్ అయింది. మరోపక్క, ఈ నెల 26 నుంచి దీనిని 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి నిర్ణయించారు.
Prabhas
Pooja Hegde
Vijay
Thaman
Ketika Sharma

More Telugu News