Botsa Satyanarayana: దొంగ ఓట్ల సంస్కృతి ఎవరిదో అందరికీ తెలుసు: చంద్రబాబుపై బొత్స విసుర్లు

Botsa fires on Chandrababu over Kuppam municipal elections
  • కుప్పం మున్సిపాలిటీలో విజయంపై బొత్స ధీమా
  • ఓడిపోతామని తెలిసే చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారని వెల్లడి
  • కుప్పంకు చంద్రబాబు ఏంచేశారన్న బొత్స
  • తన స్థాయిని దిగజార్చుకుంటున్నారని వ్యాఖ్యలు
కుప్పం పురపాలక ఎన్నికల్లో తమదే విజయం అని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పంలో ఓడిపోతామని తెలిసి వైసీపీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు, పోలింగ్ సిబ్బంది సాయంతో అక్రమాలకు పాల్పడ్డామని, దొంగ ఓట్లు వేయించామని తమపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో చంద్రబాబు తన స్థాయిని మరింత దిగజార్చుకోవడం తప్ప మరొకటి కాదని అన్నారు. అయినా, దొంగ ఓట్లు వేయించే సంస్కృతి ఎవరిదో అందరికీ తెలుసని బొత్స వ్యాఖ్యానించారు.

గత 40 ఏళ్లుగా కుప్పంకు ప్రాతినిధ్యం వహిస్తూ, ఇప్పుడు మేం నీళ్లు ఇవ్వలేదని ఆరోపించడానికి చంద్రబాబుకు సిగ్గుండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉండగా చంద్రబాబు కుప్పంకు ఏంచేశారు? ఆయనా మాపై విమర్శలు చేసేది? అని నిలదీశారు.
Botsa Satyanarayana
Chandrababu
Municipal Elections
YSRCP
TDP

More Telugu News