Surya Kantham: ప్రముఖ నటి సూర్యకాంతం పేరిట ప్రత్యేక కవరు రూపొందించిన పోస్టల్ శాఖ

Postal department will launches new postal cover on legendary actress Surya Kantham

  • గయ్యాళి పాత్రలకు పెట్టింది పేరు 
  • సహజ నటనతో రాణింపు  
  • కాకినాడలో పోస్టల్ కవరు ఆవిష్కరణ
  • ఈ నెల 18న కార్యక్రమం

నటి సూర్యకాంతం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గయ్యాళి అత్త పాత్రలకు పెట్టింది పేరు. ఎంతో సహజమైన నటనతో సూర్యకాంతం తెలుగు ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్రవేశారు. కాగా, సూర్యకాంతం స్మారకార్థం పోస్టల్ శాఖ ఆమె పేరిట ప్రత్యేక కవరు రూపొందించింది. దీనిని ఈ నెల 18న ఆవిష్కరించనున్నారు.

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సూర్యకాంతం స్వస్థలం కాకినాడలో జరుగుతుందని కాకినాడ డివిజన్ పోస్టల్ సూపరింటిండెంట్ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎంపీ వంగా గీత, స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నగర మేయర్ శివ ప్రసన్న, విశాఖ రీజియన్ పోస్టుమాస్టర్ జనరల్ ఎం.వెంకటేశ్వర్లు హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News