Jagan: రైతుల కోసం మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం: జగన్

Starting one more good scheme for welfare of farmers says Jagan
  • విపత్తుల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
  • రైతులు ఇబ్బంది పడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది
  • ఏ సీజన్ లో నష్టపోయిన రైతును అదే సీజన్ లో ఆదుకుంటాం
ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన రైతులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. రైతులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పారు. రబీలో నష్టపోయిన 34,586 మంది రైతులకు రూ. 22 కోట్లను వారి ఖాతాల్లోకి జమ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఇబ్బంది పడితే మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థే కుదేలవుతుందని చెప్పారు. రాష్ట్రంలో 62 శాతానికి పైగా వ్యవసాయంపైనే ఆధారపడ్డారని అన్నారు. రైతులు నష్టపోకూడదనేదే తమ ప్రధాన ధ్యేయమని చెప్పారు. అన్నదాతల కోసం మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని... ఏ సీజన్ లో నష్టపోయిన రైతులను అదే సీజన్ లో ఆదుకుంటామని తెలిపారు.
Jagan
YSRCP
Farmers

More Telugu News