Anantapur District: అనంతపురం జిల్లా కదిరిలో దారుణం.. దోపిడీ దొంగల చేతిలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలి దారుణ హత్య

burglars in kadiri killed Govt teacher
  • కదిరిలో చెలరేగిపోయిన దోపిడీ దొంగలు
  • దోపిడీని అడ్డుకున్నందుకు హత్య
  • మరో ఇంట్లోని మహిళపైనా దాడి
అనంతపురం జిల్లా కదిరిలో దోపిడీ దొంగలు చెలరేగిపోయారు. దోచుకునే క్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిని హత్య చేశారు. మరో ఇంట్లోనూ దోపిడీకి యత్నించి ఆ ఇంట్లోని మహిళపైనా దాడిచేశారు. కదిరికి చెందిన ఉష (45) ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఆమె భర్త వాకింగ్‌కు వెళ్లిన విషయాన్ని గుర్తించిన దొంగల ముఠా ఉష ఇంట్లోకి ప్రవేశించి దోపిడీకి యత్నించింది. వారిని ఆమె అడ్డుకునేందుకు యత్నించగా దారుణంగా హత్య చేసి అందినంత దోచుకున్నారు.

ఆపై పక్కనే ఉన్న మరో ఇంట్లోకి చొరబడ్డారు. ఆ ఇంట్లోని మహిళపై దాడిచేసి దోచుకుని పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆమెను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఉష మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దొంగల ముఠా కోసం గాలిస్తున్నారు.
Anantapur District
Kadiri
Burglars
Andhra Pradesh
Teacher
Crime News

More Telugu News