Bandi Sanjay: టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ పోరాటం.. నేటి నుంచి జిల్లాల పర్యటనకు బండి సంజయ్!

Bandi Sanjay to go to districts from today
  • రైతుల ధాన్యాన్ని కొనే విషయంలో ప్రభుత్వంపై పోరాటం
  • ఈరోజు నల్గొండ జిల్లా, రేపు సూర్యాపేట జిల్లాలో బండి సంజయ్ పర్యటన
  • రైతుల సమస్యలను తెలుసుకోనున్న సంజయ్

రైతులు పండించిన ధాన్యాన్ని కొనే విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ బీజేపీ పోరాటానికి సిద్ధమయింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈ రోజు నుంచి జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈరోజు నల్గొండ, రేపు సూర్యాపేట జిల్లాల్లో ఆయన పర్యటించనున్నారు.

ఈరోజు ఆయన నల్గొండ రూరల్ మండలం అర్జాలబావి ఐకేపీ సెంటర్ ను పరిశీలించనున్నారు. మిర్యాలగూడ, నేరేడుచర్ల, గడ్డిపల్లి రైతులను కలవనున్నారు. మార్కెట్ లో ధాన్నాన్ని అమ్మడంలో ఎదురవుతున్న సమస్యలు, ధాన్యానికి కనీస మద్దతు ధర, రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం ఈ రాత్రికి సూర్యాపేటలో ఆయన బస చేస్తారు. రేపు తిరుమలగిరి, తుంగతుర్తి, దేవరుప్పల, జనగామ మండలాల్లో ఆయన పర్యటిస్తారు.

  • Loading...

More Telugu News