Uttar Pradesh: యూపీ ఎన్నికల్లో సింగిల్‌గానే బరిలోకి కాంగ్రెస్.. అన్ని స్థానాల్లోనూ పోటీ

Congress will contest lonely in Uttar pradesh assembly polls
  • కాంగ్రెస్ ఒంటరిగానే విజయం సాధిస్తుందన్న ప్రియాంక గాంధీ
  • అన్ని స్థానాలకు కాంగ్రెస్ కార్యకర్తలను నామినేట్ చేస్తామన్న నేత
  • ప్రియాంకను యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రకటించే అవకాశం
ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీకి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ సింగిల్‌గానే అన్ని స్థానాల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించింది. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలిపారు. బులంద్‌షహర్‌లో కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘ప్రతిజ్ఞ సమ్మేళన్-లక్ష్య 2022’ కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

యూపీలోని అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందన్న ప్రియాంక.. అన్ని స్థానాలకు కాంగ్రెస్ కార్యకర్తలనే నామినేట్ చేస్తామన్నారు. కాంగ్రెస్ ఒంటరిగానే విజయం సాధిస్తుందని అన్నారు. కాగా, యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 7 స్థానాలకు మాత్రమే పరిమితం కాగా, 312 స్థానాలు గెలుచుకున్న బీజేపీ అధికారాన్ని చేపట్టింది.
Uttar Pradesh
Congress
Priyanka Gandhi

More Telugu News