CM Jagan: రోడ్డు పక్కన మహిళను చూసి కాన్వాయ్ ఆపించిన సీఎం జగన్... వీడియో ఇదిగో!

CM Jagan stops his convoy after seen a woman running
  • తిరుపతిలో జోనల్ కౌన్సిల్ సమావేశం
  • హాజరైన సీఎం జగన్
  • ఎయిర్ పోర్టు నుంచి తాజ్ హోటల్ కు వెళుతుండగా ఘటన
  • మహిళ నుంచి వివరాలు తీసుకున్న అధికారి 
తిరుపతిలో దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశానికి ఏపీ సీఎం జగన్ కూడా హాజరయ్యారు. కాగా, ఈ సమావేశానికి వెళ్లే క్రమంలో ఆయన ఓ మహిళ పట్ల స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతిలోని తాజ్ హోటల్ కు వెళుతుండగా, ఓ మహిళ చేతిలో పత్రాలతో కాన్వాయ్ వెంట పరిగెడుతుండడాన్ని సీఎం గమనించారు. దాంతో కాన్వాయ్ ఆపించి ఆ మహిళ సమస్య ఏంటో తెలుసుకోవాలని తన ఓఎస్డీని పంపించారు.

ఆమె పేరు విజయకుమారి. కడప జిల్లా రైల్వే కోడూరుకు చెందిన మహిళ. అనారోగ్యంతో బాధపడుతున్నానని, కుటుంబ పోషణ కోసం ఏదైనా ఉపాధి చూపించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఆమె నుంచి వివరాలు తీసుకున్న అనంతరం సీఎం జగన్ కాన్వాయ్ ముందుకు కదిలింది.
CM Jagan
Convoy
Woman
Tirupati

More Telugu News