Golden Mask: బంగారంతో కరోనా మాస్కు... ధర మామూలుగా లేదు మరి!

Man with golden mask in West Bengal gets attention
  • కరోనా వేళ మాస్కుల వినియోగం
  • బంగారంతో మాస్కు చేయించుకున్న బెంగాల్ వ్యాపారవేత్త
  • 108 గ్రాముల బంగారంతో మాస్కు
  • ధర రూ.5.70 లక్షలు
కరోనా వేళ మాస్కుల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. మాస్కుల్లో కూడా ఎన్95, కాటన్ మాస్కులు, డిజైనర్ మాస్కులు, ప్రింటెడ్ మాస్కులు ఇలా ఎన్నో వచ్చాయి. అయితే వీటన్నింటిని మించిపోయేలా బంగారం మాస్కు వచ్చింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ వ్యాపారవేత్త పసిడి మాస్కు ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు.

చందన్ దాస్ అనే నగల డిజైనర్ సాయంతో తనకిష్టమైన విధంగా బంగారంతో ఆ మాస్కును తయారుచేయించుకున్న ఆ బిజినెస్ మేన్ ఇప్పుడు ఎక్కడికెళ్లినా అందరి కళ్లు అతడిపైనే. ఈ మాస్కు కోసం 108 గ్రాముల బంగారాన్ని వినియోగించారు. దీని ఖరీదు రూ.5.70 లక్షలు. కోల్ కతాలో దుర్గాపూజ సందర్భంగా ఈ గోల్డెన్ మాస్కుతో వచ్చిన వ్యాపారవేత్తను చూసేందుకు జనం ఎగబడ్డారట.

ఈ బంగారం మాస్కు ఫొటోలను ఓ మహిళా జర్నలిస్టు సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఈ విషయం వైరల్ అయింది.
Golden Mask
Businessman
West Bengal
Corona Virus

More Telugu News