Andhra Pradesh: ఏపీలో కొనసాగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్

Polling begins for local body polls in Andhra Pradesh
  • వివిధ కారణాల వల్ల వాయిదా పడిన ఎన్నికలు
  • 36 సర్పంచ్, 68 వార్డు సభ్యుల స్థానాలకు కొనసాగుతున్న పోలింగ్
  • సాయంత్రానికి పూర్తి ఫలితాలు!
ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కారణాల వల్ల వాయిదా పడిన 36 సర్పంచ్, 68 వార్డు సభ్యుల స్థానాలకు ఈ ఉదయం పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగుతుంది. అనంతరం 2 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. సాయంత్రానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

కాగా, ఇప్పటికే 30 సర్పంచ్ స్థానాలు, 380 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. కాగా, రేపు నెల్లూరు నగరపాలక సంస్థతోపాటు 12 మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు జరగనుండగా, మంగళవారం 10 జడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ జరుగుతున్న గ్రామాల్లో పోలీసులు భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు.
Andhra Pradesh
Local Body Polls
Polling

More Telugu News