హైదరాబాద్ మెట్రోలో మాస్క్ తీసి మాట్లాడుతున్నారా?.. బిగ్బాస్ మిమ్మల్ని గమనిస్తున్నాడు!
- స్టార్ మాతో జత కట్టిన ఎల్అండ్టీ
- ‘బిగ్బాస్ మిమ్మల్ని గమనిస్తున్నాడు’ అంటూ ప్రచారం
- కరోనాపై అవగాహన, సురక్షిత ప్రయాణ పద్ధతులపై అవగాహనే లక్ష్యం
బిగ్బాస్ వ్యాఖ్యాత నాగార్జున, ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో ఎండీ కేవీబీరెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 100 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని, ప్రయాణికుల భద్రతపై మరింత అవగాహన కల్పించడమే ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశమని నాగార్జున తెలిపారు. కరోనాపై అవగాహన, సురక్షిత ప్రయాణ పద్ధతులపై అవగాహన పెంపొందించడం, మొబైల్ క్యూఆర్ కోడ్ టికెట్లు, స్మార్ట్ కార్డుల వినియోగంపై అవగాహన పెంపొందించడమే ఈ ప్రచారం లక్ష్యమని కేవీబీ రెడ్డి పేర్కొన్నారు.