Gopichand Malineni: చిన్నప్పుడు చొక్కాలు చించుకుని ఒక్క సారైనా కలవాలని నేను కలలు కన్న హీరో బాలయ్య: దర్శకుడు గోపీచంద్ మలినేని

Gopichand Malineni shows immense admiration on Nandamuri Balakrishna
  • బాలకృష్ణ 107వ చిత్రం ప్రారంభం
  • బాలయ్య సరసన శ్రుతిహాసన్
  • గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చిత్రం
  • సంబరపడిపోతున్న గోపీచంద్ మలినేని
  • నా బాలయ్య అంటూ ట్వీట్
నందమూరి బాలకృష్ణ, శ్రుతిహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో భారీ చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాదులో ఘనంగా జరిగాయి. అగ్రహీరో బాలకృష్ణతో హైఓల్టేజ్ సినిమా తెరకెక్కిస్తుండడం పట్ల దర్శకుడు గోపీచంద్ మలినేని ఉత్సాహం అంబరాన్నంటింది. ఆయన చేసిన ట్వీటే అందుకు నిదర్శనం. చిన్నప్పుడు బాలయ్య సినిమాల కోసం చొక్కాలు చించుకున్నానని, ఒక్కసారైనా కలవాలని నేను కలలు కన్న అభిమాన హీరో బాలయ్య అని గోపీచంద్ వివరించారు.

"టాలీవుడ్ చిత్ర పరిశ్రమకి వచ్చిన తర్వాత ఎలాగైనా ఆయనను డైరెక్ట్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్న నా అభిమాన మాస్ హీరో బాలయ్య. నా బాలయ్యతో పనిచేసే భాగ్యం కలగడం నా లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ కంటే లైఫ్ టైమ్ రెస్పాన్సిబిలిటీగా భావిస్తాను. జై బాలయ్య" అంటూ ఓ అభిమానిగా తన స్పందన వెలిబుచ్చారు.
Gopichand Malineni
Nandamuri Balakrishna
NBK107
Tollywood

More Telugu News