Sania Mirza: వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఆటగాళ్లను అభినందించిన సానియా... నెటిజన్ల ఫైర్ 

Trolling against Sania Mirza due to her support for Pakistan team
  • ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మ్యాచ్ కు హాజరైన సానియా
  • పాక్ ఆటగాళ్లను అభినందిస్తూ చప్పట్లు
  • ఫోర్లు కొట్టినప్పుడు, వికెట్లు తీసినప్పుడు సానియా ఉత్సాహం
  • సానియా భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్లు
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. అయితే, ఆస్ట్రేలియా-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ కు సానియా మీర్జా కూడా విచ్చేశారు. గ్యాలరీలో కూర్చున్న ఆమె పాక్ ఆటగాళ్లు బౌండరీలు బాదుతున్నప్పుడు, వికెట్లు తీస్తున్నప్పుడు చప్పట్లు కొడుతూ అభినందించడం టీవీల్లో కనిపించింది. దీనిపై భారత నెటిజన్లు మండిపడుతున్నారు.

సానియా భారత పౌరసత్వాన్ని రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. అంతేకాదు, ఆమెపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరుతున్నారు. భారతదేశానికి చెందిన మహిళ అయ్యుండి పాకిస్థాన్ జట్టుకు మద్దతు ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తమ ట్వీట్లకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను ట్యాగ్ చేస్తున్నారు.

భారత్, పాకిస్థాన్ వివాదాల నేపథ్యంలో సానియా మీర్జాపై ట్రోలింగ్ కొత్తేమీ కాదు. గతంలోనూ అనేక సందర్భాల్లో ఆమె నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.
Sania Mirza
Trolling
Pakistan
Australia
Semis
T20 World Cup

More Telugu News