Mayawati: బీఎస్పీ అధినేత్రి మాయావతికి మాతృవియోగం

BSP Chief Mayawati mother Ramrati died
  • మాయావతి తల్లి రామ్రాటి కన్నుమూత
  • ఢిల్లీలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • హుటాహుటీన ఢిల్లీ బయల్దేరిన మాయావతి
  • రేపు అంత్యక్రియలు
బహుజన్ సమాజ్ వాదీ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతికి మాతృవియోగం కలిగింది. మాయవతి తల్లి రామ్రాటి (92) నేడు ఢిల్లీలో కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న రామ్రాటి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస (హార్ట్ ఫెయిల్యూర్) విడిచారు. ఈ మేరకు బీఎస్పీ ఓ ప్రకటన వెలువరించింది.

తల్లి మరణవార్త విని మాయావతి హుటాహుటీన లక్నో నుంచి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మాయావతి తల్లి అంత్యక్రియలు రేపు ఢిల్లీలో నిర్వహించనున్నారు. రామ్రాటి మృతి పట్ల బీఎస్పీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా, ఏడాది కిందట మాయావతి తండ్రి ప్రభుదయాళ్ (95) కన్నుమూశారు.
Mayawati
Mother
Ramrati
Demise
BSP
Uttar Pradesh

More Telugu News