Vellampalli Srinivasa Rao: ఏపీపై తెలంగాణ మంత్రులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదు: వెల్లంపల్లి

Its not good for TS ministers to talk about AP says Vellampalli
  • వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఏపీపై కామెంట్లు చేస్తున్నారు
  • టీఎస్ సీఎం, మంత్రులు ఇలాంటి వైఖరిని మార్చుకోవాలి
  • చంద్రబాబు ఎప్పుడూ నిజాలు మాట్లాడరు
తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ మంత్రులు ఏపీపై కామెంట్లు చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, ఆ రాష్ట్ర మంత్రులు కానీ ఏపీ గురించి మాట్లాడటం సరికాదని చెప్పారు. ఇలాంటి వైఖరిని వారు మార్చుకోవాలని సూచించారు. ఈరోజు ఆయన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడూ నిజాలు మాట్లాడరని, నిజాలు మాట్లాడితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే మునిశాపం ఆయనకు ఉందని వెల్లంపల్లి ఎద్దేవా చేశారు. ఇదే విషయాన్ని గతంలో వైయస్ రాజశేఖరరెడ్డి కూడా చెప్పారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాదిరి, అధికారంలో లేకపోతే మరో మాదిరి మాట్లాడటం చంద్రబాబు నైజమని విమర్శించారు. కుప్పం నియోజకవర్గంలో కూడా వైసీపీ జెండాను ఎగురవేస్తామని చెప్పారు.
Vellampalli Srinivasa Rao
YSRCP
Chandrababu
Telugudesam
KCR
TRS

More Telugu News