Nara Lokesh: ఆప్షన్ల నాటకాన్ని జగన్ కట్టిపెట్టాలి: నారా లోకేశ్

Jagan has to stop Aided Schools options drama says Nara Lokesh
  • ఎయిడెడ్ విద్యాసంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్లపై లోకేశ్ స్పందన 
  • తన తప్పులను తానే బయటపెట్టుకునే గొప్పదనం జగన్ ది
  • జీవో 42, 50, 51, 19లను రద్దు చేయాలి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను ఉద్దేశించి టీడీపీ నేత నారా లోకేశ్ సెటైర్లు వేశారు. తప్పుడు పనులు చేసి, కప్పిపుచ్చుకునే క్రమంలో తన తప్పులను తానే బయటపెట్టుకునే గొప్పదనం జగన్ దని అన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్ల గురించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

లోకేశ్ జీవో 42 సరిగా చదవలేదని... అందులో రెండు కాదు మూడు ఆప్షన్లు ఇచ్చామంటూ ప్రజలను తప్పుదోవ పట్టించబోయారని విమర్శించారు. ఇప్పుడు మరో రెండు ఆప్షన్లను ఇస్తున్నామని మెమో జారీ చేసి అడ్డంగా బుక్కయ్యారని ఎద్దేవా చేశారు. ఆప్షన్ల నాటకాన్ని జగన్ కట్టిపెట్టాలని... ఎయిడెడ్ విద్యా సంస్థల ఆస్తులను కొట్టేయాలనే కుట్రతో తెచ్చిన జీవో 42, 50, 51, 19లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
Nara Lokesh
Telugudesam
Jagan
YSRCP
Aided Schools

More Telugu News