నా భర్త చేసిన నేరం ఏమిటి?.. ఆయనను వెంటనే విడుదల చేయాలి: ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు సంధ్య
- మా ప్రింటింగ్ ప్రెస్ పై నిన్న 50 మంది పోలీసులు దాడి చేశారు
- కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లు, ప్రింట్ అయిన పుస్తకాలను తీసుకెళ్లారు
- నా భర్తపై పెట్టిన కేసులను విత్ డ్రా చేసుకోవాలి
తన భర్త చేసిన తప్పేంటని సంధ్య ప్రశ్నించారు. దివంగత ఆర్కే భార్య ఆమె భర్త జ్ఞాపకార్థం ఒక బుక్ ప్రింట్ చేయమని ఇచ్చారని... ఆ బుక్ ను తమ ప్రింటింగ్ ప్రెస్ అడ్రస్ తో ప్రింట్ చేశామని తెలిపారు. ఆర్కే చనిపోయాడని... ఆయన బుక్ ను ప్రింట్ చేస్తే తప్పేముందని ప్రశ్నించారు. ప్రింటింగ్ ప్రెస్ లో సీజ్ చేసిన మెటీరియల్ మొత్తాన్ని తిరిగిచ్చేయాలని డిమాండ్ చేశారు. తన భర్తపై పెట్టిన కేసులను విత్ డ్రా చేసుకుని, వెంటనే ఆయనను విడుదల చేయాలని అన్నారు.