తమన్నా నో చెప్పిన పాత్రలో శ్రుతిహాసన్!
- బాలకృష్ణ సినిమాకి నో చెప్పిన తమన్నా
- అదే పాత్రకి ఎస్ చెప్పిన శ్రుతి
- 'భోళా శంకర్' సినిమాకి ఓకే చెప్పిన తమన్నా
- అంతకుముందు నో చెప్పిన శ్రుతి
ముందుగా ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం తమన్నాను అనుకున్నారట. అయితే కొన్ని కారణాల వలన ఆమె ఈ సినిమా చేయలేనని చెప్పిందట. దాంతో శ్రుతిహాసన్ తో ఉన్న పరిచయం కారణంగా, గోపీచంద్ ఆమెను ఒప్పించాడని అంటున్నారు. అలా బాలయ్య సినిమాలో ఆమె ఎంట్రీ ఖరారైపోయింది.
ఇక మరో విశేషం ఏమిటంటే .. చిరంజీవి 'భోళా శంకర్' సినిమా కోసం ముందుగా శ్రుతిని అడిగితే, వాళ్లు అడిగిన డేట్లు ఖాళీ లేని కారణంగా ఆమె చేయలేనని చెప్పిందట. ఆమె నో చెప్పిన తరువాతనే తమన్నాను ఎంపిక చేశారట. అలా ఒకరు నో చెప్పిన సినిమాకి మరొకరు ఎస్ చెప్పారన్న మాట.