Nithin: 'మాచర్ల నియోజకవర్గం' రిలీజ్ డేట్ ఖరారు!

Macharla Niyojakavargam movie release date confirmed
  • నితిన్ హీరోగా 'మాచర్ల నియోజక వర్గం'
  • ఆయన సరసన నాయికగా కృతి శెట్టి
  • సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్
  • ఏప్రిల్ 29వ తేదీన విడుదల  
నితిన్ కి ఈ ఏడాది పెద్దగా కలిసిరాలేదనే చెప్పాలి. 'భీష్మ' తరువాత ఆయన చేసిన మూడు సినిమాలు ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆయన చేసిన 'చెక్' .. 'రంగ్ దే '  సినిమాలు థియేటర్లలో వచ్చాయి. 'మాస్ట్రో' మాత్రం ఓటీటీలో వచ్చింది. అయినా మూడు సినిమాలు నిరాశపరిచాయి.

ఆ తరువాత సినిమాను ఆయన రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాకి 'మాచర్ల నియోజక వర్గం' అనే టైటిల్ ను కూడా ఆల్రెడీ సెట్ చేశారు. కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగు జరుగుతోంది. తాజాగా ఈ సినిమాకి రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

నితిన్ సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమవుతున్న ఈ సినిమాకి, మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. నితిన్ జోడీగా కృతి శెట్టి అలరించనుంది. నాని .. సుధీర్ బాబు సినిమాలను పూర్తి చేసిన ఆమె, ప్రస్తుతం రామ్ .. చైతూ సినిమాలను చేస్తోంది. అలాగే నితిన్ షూటింగులోను పాల్గొంటోంది.
Nithin
Krithi Shetty
Rajasekhar Reddy

More Telugu News