Australia: ఆ సమయంలో ఏం జరుగుతోందో అర్థం కాలేదు.. సంచలన ఇన్నింగ్స్ పై స్పందించిన మాథ్యూ వేడ్

Mathew Wade Responded On His Sensational Innings
  • పడిన బంతిని పడ్డట్లే బాదాలనుకున్నా
  • తాను ఔటైనా ఆస్ట్రేలియా గెలిచి ఉండేది
  • వార్నర్ నిలకడగా ఆడాడని ప్రశంస
తన సంచలన ఇన్నింగ్స్ పై ఆస్ట్రేలియా బ్యాటర్ మాథ్యూ వేడ్ స్పందించాడు. హసన్ అలీ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన అతడు.. మూడు సిక్సర్లు బాదేసి ఆస్ట్రేలియాను గెలిపించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ క్యాచ్ ను హసన్ అలీ పట్టి ఉండి తాను ఔటైనా తన జట్టే గెలిచి ఉండేదని వేడ్ చెప్పుకొచ్చాడు. ఒకరకంగా క్యాచ్ వదిలేయడం తమకు కలిసొచ్చిందని, అయినా అప్పటికే స్టోయినిస్ క్రీజులో ఉండడం, తాను ఔటైనా భారీ షాట్లు ఆడగలిగే కమిన్స్ ఇంకా మిగిలే ఉండడంతో తమకే గెలిచే అవకాశాలు ఎక్కువున్నాయని చెప్పాడు.

అయినా ఆ సమయంలో ఏం జరుగుతోందో తనకు అస్సలు అర్థం కాలేదని వేడ్ చెప్పాడు. పడిన బంతిని పడ్డట్టుగానే స్టాండ్స్ లోకి పంపాలని ముందే డిసైడ్ అయినట్టు చెప్పాడు. విజయానికి తన ఇన్నింగ్స్ ఒక్కటే కారణం కాదని, వరుస వికెట్లు కోల్పోయినా.. వార్నర్ నిలకడగా ఆడి విజయానికి పునాదులు వేశాడని చెప్పాడు. కాగా, ఆదివారం జరిగే ఫైనల్ లో న్యూజిలాండ్ తో ఆసీస్ తలపడనుంది. ఆ మ్యాచ్ దుబాయ్ లో జరగనుంది.
Australia
Cricket
T20 World Cup
Mathew Wade

More Telugu News