: మిగతా మంత్రులనూ సాగనంపాలి: బీజేపీ

26 అక్రమ జీవోల జారీ కేసులో సుప్రీంకోర్టు నుంచి నోటీసులు అందుకున్న మిగతా మంత్రులనూ కూడా పదవుల నుంచి తొలగించాలని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు సబిత, ధర్మాన ప్రసాదరావును తొలగించినందుకు ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఎవరు అవిశ్వాస తీర్మానం పెట్టినా బీజేపీ సహకరిస్తుందన్నారు.

More Telugu News