Jagan: జగన్ కాలికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు

Jagan visited hospital for leg swelling checkup
  • సెప్టెంబర్ 4న వ్యాయామం చేస్తుండగా బెణికిన కాలు
  • డాక్టర్ల ట్రీట్మెంట్ తో కోలుకున్న జగన్
  • ఇప్పుడు మళ్లీ వాచిన కాలు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రికి వెళ్లిన సీఎంకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. సెప్టెంబర్ 24న వ్యాయామం చేస్తూ ఆయన గాయపడిన సంగతి తెలిసిందే. జిమ్ చేస్తున్న సందర్భంగా ఆయన కాలు బెణికింది. దీంతో ఆయనను పరీక్షించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

 డాక్టర్లు ఇచ్చిన ట్రీట్మెంట్ తో ఆయన కోలుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ అదే కాలుకి వాపు వచ్చింది. దీంతో మణిపాల్ ఆసుపత్రికి వెళ్లారు. ఈ సందర్భంగా జగన్ ఆసుపత్రిలో 45 నిమిషాలు ఉన్నారు. వైద్యులు ఆయన కాలికి పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం జగన్ తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.
Jagan
Leg swelling
Checkup
YSRCP

More Telugu News