Salman Khan: చిరంజీవి సినిమాలో నటించనున్న సల్మాన్ ఖాన్!

Salman Khan to act in Chiranjeevi Godfather movie
  • 'గాడ్ ఫాదర్' చిత్రంలో నటించనున్న సల్మాన్ ఖాన్
  • పూర్తి క్లారిటీ ఇచ్చిన సంగీత దర్శకుడు తమన్
  • బ్రిట్నీ స్పియర్స్ ను కూడా సంప్రదిస్తామని వ్యాఖ్య
మెగాస్టార్ చిరంజీవి సినిమా 'గాడ్ ఫాదర్'లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించబోతున్నారనే వార్త గత కొంత కాలంగా చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై ఈ సినిమా సంగీత దర్శకుడు తమన్ క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి, సల్మాన్ ఇద్దరూ కలిసి నటించనున్న వార్త నిజమేనని చెప్పారు.

ఇద్దరు స్టార్లు కలిసి డ్యాన్స్ చేయడమనేది తమకు చాలా పెద్ద విషయమని... అందుకే ఆ పాట స్థాయి కూడా చాలా పెద్దగా ఉండాలని భావిస్తున్నామని తెలిపారు. హాలీవుడ్ నటి, సింగర్ బ్రిట్నీస్పియర్స్ తో సంప్రదించేందుకు కూడా ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నామని చెప్పారు. ఆమెతో పాటను తెలుగులో పాడించాలా? లేక ఇంగ్లీష్ ట్రాక్ పాడించాలా? అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. మలయాళ సినిమా 'లూసిఫర్'కి రీమేక్ 'గాడ్ ఫాదర్' అనే విషయం తెలిసిందే.
Salman Khan
Chiranjeevi
Tollywood
Bollywood
Thamann

More Telugu News