Tollywood: నా చావుకి కారణం యూవీ క్రియేషన్స్ అంటూ ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ నోట్.. సోషల్ మీడియాలో వైరల్

Prabhas Fan Pens Suicide Note For Demanding Radhe Shyam Updates
  • ప్రభాస్ తో 'రాధేశ్యామ్' నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ 
  • అప్ డేట్స్ ఇవ్వకపోవడం వల్లేనంటూ కామెంట్
  • అభిమానుల భావోద్వేగాలతో ఆడుకోవద్దంటూ విన్నపం
యంగ్ రెబెల్ స్టార్ వీరాభిమాని ఒకరు ఆత్మహత్య లేఖ రాశారు. ఆ లెటర్ వైరల్ గా మారింది. ప్రభాస్ అప్ కమింగ్ సినిమా రాధే శ్యామ్ జనవరి 14న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమా టీజర్ కూడా విడుదలైంది. అయితే, అప్పట్నుంచి సినిమా గురించి అప్ డేట్లు ఏమీ ఇవ్వకపోతుండడంతో ఆవేదన చెందిన అభిమాని ఇలా లెటర్ రాశాడు.  

‘‘సార్.. నేను ఇంత వరకు ఒక్క లెటర్ కూడా రాయలేదు. కానీ, సూసైడ్ లెటర్ రాస్తా అని కలలో కూడా అనుకోలేదు. మీరు సినిమా అప్ డేట్స్ ఇవ్వకపోవడం వల్ల రాయకతప్పట్లేదు. కనీసం నా చావుతోనైనా ‘రాధేశ్యామ్’ అప్ డేట్స్ ఇస్తారని అనుకుంటున్నా. చాలా రోజులు వెయిట్ చేయించారు.. మేం చేశాం. ఇక చాలు సర్. నా చావుకి కారణం యూవీ క్రియేషన్స్ టీం, డైరెక్టర్ రాధాకృష్ణ.. చిన్న మనవి. అభిమానుల భావోద్వేగాలతో ఆడుకోవద్దు’’ అంటూ లేఖను ముగించాడు. అయితే, ఆ లేఖ రాసిందెవరన్నది మాత్రం తెలియరాలేదు. సోషల్ మీడియాలో సూసైడ్ నోట్ కాస్తా వైరల్ అయిపోతోంది. అభిమానులెవరూ ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని తోటి నెటిజన్లు కోరుతున్నారు.
Tollywood
Prabhas
Radhe Shyam
Suicide Note
UV Creations

More Telugu News