అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తిని స్వయంగా భుజాలపై మోసిన లేడీ ఎస్సై... వీడియో వైరల్
- చెన్నైలో భారీ వర్షాలు
- రోడ్డు పక్కన స్పృహలేని స్థితిలో వ్యక్తి
- ఆటో వరకు మోసుకొచ్చిన ఎస్సై రాజేశ్వరి
- హ్యాట్సాఫ్ అంటున్న నెటిజన్లు
రోడ్డు పక్కన విరిగిపడిన చెట్ల కొమ్మల మధ్య ఓ వ్యక్తి పడివున్నట్టు సమాచారం అందుకున్న ఆమె వెంటనే స్పందించారు. హుటాహుటీన అక్కడికి చేరుకుని చెట్ల కొమ్మలను తొలగించి, ఆ వ్యక్తిని కాపాడారు. అతడిని ఆటో వరకు మోసుకొచ్చారు. స్థానికుల సహకారంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. లేడీ ఎస్సై మానవతా దృక్పథానికి నెటిజన్లు హ్యాట్సాఫ్ అంటున్నారు.