Chandrababu: అభ్యర్థులు కోర్టుకు వెళితే మంత్రులు జైలుకు వెళ్లే పరిస్థితి ఉంది: చంద్రబాబు

Chandrababu responds on local body elections
  • స్థానిక ఎన్నికలపై చంద్రబాబు స్పందన
  • దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం
  • బలవంతపు నామినేషన్ల ఉపసంహరణకు పాల్పడ్డారని ఆరోపణ
  • సంతకాలు ఫోర్జరీ అని తేలాయని వ్యాఖ్య  
రాష్ట్రంలో పలు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ దుర్మార్గంగా ఉందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఇప్పుడు ఏకగ్రీవాలు పెరిగాయని వ్యాఖ్యానించారు. బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ భారీగా జరిగిందని వివరించారు. ఇతర పార్టీల అభ్యర్థులను బెదిరించి అధికార పక్ష నేతలు ఏకగ్రీవాలు చేసుకున్నారని మండిపడ్డారు.

నామినేషన్ల ఉపసంహరణ పత్రాలపై సంతకాలు ఫోర్జరీ అని న్యాయస్థానంలో తేలిందని అన్నారు. ఆర్వోలు బాధ్యత వహించి విధుల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అభ్యర్థులు కోర్టుకు వెళితే మంత్రులు జైలుకు వెళ్లే పరిస్థితి ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Chandrababu
Local Body Polls
Nominations
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News