Vijay Sai Reddy: మంత్రాలకు చింతకాయలు రాలవు... బెదిరిస్తే ఓట్లు రావు!: చంద్రబాబుపై విజయసాయి విమర్శలు

Vijaysai Reddy once again take a jibe over Chandrababu and Lokesh
  • ట్విట్టర్ లో స్పందించిన విజయసాయి
  • జనాన్ని తాట తీస్తానని బాబు హెచ్చరించాడని ఆరోపణ
  • లోకేశ్ వీరంగం వేస్తున్నాడని వెల్లడి 
  • రోడ్లపై తిరగనివ్వబోమని అంటున్నాడని వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. గతంలో తాను నిర్మించిన రోడ్లపై నడుస్తున్నారని, ఓటు వేయకపోతే తాట తీస్తానని చంద్రబాబు బెదిరించారని విజయసాయి ఆరోపించారు. మంత్రాలకు చింతకాయలు రాలవు... బెదిరిస్తే ఓట్లు రావు బాబూ అంటూ హితవు పలికారు. జనం తమను తరిమివేశారన్న ఉక్రోషంతో లోకేశ్ అసభ్య పదజాలంతో వీరంగం వేస్తున్నాడని, రోడ్లపై ఎవరినీ తిరగబోనివ్వమని అంటున్నాడని వివరించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

అంతకుముందు చేసిన ట్వీట్లలోనూ విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు పొరుగు రాష్ట్రాల సీఎంలతో ఉప్పు-నిప్పులా వ్యవహరించాడని ఆరోపించారు. తను రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి వాళ్లెవరికీ అడ్రెస్ లేదని, చివరికి మోదీ, అమిత్ షా కూడా తనకంటే జూనియర్లేనని హేళన చేశాడని వివరించారు. కానీ జగన్ వచ్చాక పొరుగు రాష్ట్రాలతో సుహృద్భావ వాతావరణం నెలకొందని విజయసాయి పేర్కొన్నారు.
Vijay Sai Reddy
Chandrababu
Nara Lokesh
Andhra Pradesh

More Telugu News