Hyderabad: హైదరాబాదులో కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్ పట్టివేత

14 KG drugs siezed in Hyderabad
  • హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు డ్రగ్స్ పంపుతున్నట్టు సమాచారం
  • ఫొటో ఫ్రేముల్లో పెట్టి డ్రగ్స్ ఎగుమతి
  • మొత్తం 14 కిలోల డ్రగ్స్ పట్టివేత
హైదరాబాదులో డ్రగ్స్ భూతం మరోసారి కలకలం రేపింది. నగరంలోని డ్రగ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బేగంపేట్ ఇంటర్నేషనల్ పార్శిల్స్ కార్యాలయంలో పోలీసులు తనిఖీలను నిర్వర్తించగా 14 కిలోల డ్రగ్స్ లభ్యమయ్యాయి. దీని విలువ రూ. 5.5 కోట్లుగా ఉంటుందని పోలీసులు చెపుతున్నారు. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు ఈ డ్రగ్స్ పంపుతున్నట్టు సమాచారం. ఫోటో ఫ్రేముల్లో పెట్టి ఈ డ్రగ్స్ ను దేశ సరిహద్దులు దాటిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Hyderabad
Drugs
Australia

More Telugu News