Tirumala: తిరుమల-పాపవినాశనం రోడ్డును మూసివేసిన అధికారులు

Trirumala Papavinashanam road closed
  • తిరుమల కొండపై భారీ వర్షాలు
  • గాలుల ధాటికి కూలిపోయిన భారీ వృక్షాలు
  • రోడ్లపై పడిన వృక్షాలు, కొమ్మలను తొలగిస్తున్న అధికారులు
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో వర్షాలు ముంచెత్తుతున్నాయి. చిత్తూరు జిల్లాలోని తిరుమల సైతం భారీ వర్షాలతో తడిసిముద్దవుతోంది. గాలుల ధాటికి కొండపై పలు చోట్ల భారీ వృక్షాలు కూలిపోయాయి. ఎన్నో చోట్ల చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి.

ఈ నేపథ్యంలో తిరుమల-పాపవినాశనం రోడ్డును అధికారులు మూసేశారు. రోడ్లపై పడిన వృక్షాలు, కొమ్మలను అటవీ, టీటీడీ అధికారులు తొలగిస్తున్నారు. మరోవైపు ఘాట్ రోడ్లలో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భద్రతా చర్యలను చేపట్టారు. ఘాట్ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Tirumala
Papavinashanam
Road closed

More Telugu News