Chiranjeevi: 'భోళా శంకర్'లో కనిపించనున్న మిగతా ఆర్టిస్టులు వీరే!

Bhola Shankar movie update
  • 'భోళా శంకర్'కి క్లాప్ పడిపోయింది
  • ఈ నెల 15 నుంచి రెగ్యులర్ షూటింగ్
  • కీలకమైన పాత్రలో రావు రమేశ్
  • సంగీత దర్శకుడిగా మహతి స్వరసాగర్
చిరంజీవి - మెహర్ రమేశ్ కాంబినేషన్లో 'భోళా శంకర్' రూపొందుతోంది. కొంతకాలం క్రితం తమిళంలో అజిత్ చేసిన 'వేదాళం'  సినిమాకి ఇది రీమేక్. అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ ప్రధానంగా ఈ సినిమా నిర్మితమవుతోంది. చెల్లెలి పాత్ర కోసం కీర్తి సురేశ్ ను .. కథానాయిక పాత్ర కోసం తమన్నాను ఎంపిక చేశారు.

ఈ నేపథ్యంలో మిగతా పాత్రలలో ఎవరెవరు నటించనున్నారు అనే ఆసక్తికలగడం సహజం. ఆ నటీనటులు వీరే అంటూ ఒక జాబితా బయటికి వచ్చింది. ఆ లిస్టులో రావు రమేశ్ .. మురళీ శర్మ .. వెన్నెల కిషోర్ .. రఘుబాబు .. ఉత్తేజ్ .. గెటప్ శ్రీను .. ప్రభాస్ శ్రీను .. బిత్తిరి సత్తి, తులసి .. ప్రగతి .. శ్రీముఖి .. రష్మీ గౌతమ్ పేర్లు కనిపిస్తున్నాయి.

సాధారణంగా చిరంజీవి సినిమాలకు మణిశర్మ సంగీతాన్ని అందిస్తూ ఉంటారు. ఈ సినిమాకి మాత్రం ఆయన తనయుడు మహతి స్వరసాగర్ స్వరాలను సమకూర్చుతున్నాడు. ఈ రోజున పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా, ఈ నెల 15వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగుకు వెళ్లనుంది.
Chiranjeevi
Tamannaah
Keerthy Suresh

More Telugu News