Mohanlal: 'మాన్ స్టర్' గా మోహన్ లాల్ ఫస్టులుక్!

Monster movie first look released
  • కొత్త ప్రాజెక్టుతో సెట్స్ పైకి మోహన్ లాల్
  • పంజాబీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో
  • యాక్షన్ నేపథ్యంలో సాగే కథ
  • దర్శకుడిగా 'పులి మురుగన్' వైశాఖ్  
మొదటి నుంచి కూడా మోహన్ లాల్ వైవిధ్యభరితమైన కథలు .. పాత్రలవైపే మొగ్గుచూపుతూ వస్తున్నారు. అలా ఆయన చేస్తున్న ప్రయోగాలు చాలా వరకూ ఫలిస్తూనే వస్తున్నాయి. తాజాగా ఆయన మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది భారీ యాక్షన్ మూవీ. ఈ సినిమా షూటింగు ఈ రోజునే మొదలైంది.

ఆంటోని పెరుంబవూర్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ సినిమాకి, వైశాఖ్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. గతంలో వైశాఖ్ దర్శకత్వంలో మోహన్ లాల్ 'పులి మురుగన్' సినిమా చేశారు. ఫారెస్టు నేపథ్యంలో నడిచే ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు 'మన్యం పులి' పేరుతో వచ్చింది. తమిళంలోనే కాదు తెలుగులోనూ ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టింది.

అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్లో 'మాన్ స్టర్' రూపొందుతోంది. సినిమా షూటింగు మొదలైన ఈ రోజునే మెహన్ లాల్ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆయన 'లక్కీ సింగ్' అనే పంజాబీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. బ్లాక్ కలర్ టీ షర్ట్ .. తలపాగా .. మెడలో 'L' లెటర్ ఉన్న సిల్వర్ చైన్ ..  చేతిలో  గన్ .. టేబుల్  పై బుల్లెట్స్ తో ఆయన ఈ పోస్టర్ లో కనిపిస్తున్నారు.
Mohanlal
Vysakh
Monster Movie

More Telugu News