Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ విడుదల

AP assembly sessions to start from Nov 18
  • ఈ నెల 18 నుంచి శీతాకాల సమావేశాలు
  • నాలుగైదు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం
  • రెండు విడతల్లో సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభ కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ విడుదల చేశారు. 18న జరిగే బీఏసీ సమావేశంలో అసెంబ్లీ పని దినాలు, అజెండాను ఖరారు చేయనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు నాలుగైదు రోజుల పాటు సమావేశాలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో శీతాకాల సమావేశాలను రెండు విడతల్లో నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.
Andhra Pradesh
AP Assembly Session

More Telugu News