Hyderabad: భాగ్యనగర వాసులకు గుడ్‌న్యూస్.. కేటీఆర్ చొరవతో ఇకపై ఉదయం ఆరు గంటల నుంచే మెట్రో రైలు సేవలు!

good news for Hyderabadis Hyderabad metro runs first rail at 6 am
  • ప్రయాణికుడి ట్వీట్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్
  • కేటీఆర్ సూచనతో నిర్ణయం తీసుకున్న మెట్రో అధికారులు
  • చివరి రైలు రాత్రి 10.15 గంటలకు

భాగ్యనగర వాసులకు హైదరాబాద్ మెట్రో గుడ్‌న్యూస్ చెప్పింది. మెట్రో రైళ్ల సమయాన్ని సవరించిన అధికారులు ఇకపై ఉదయం 6 గంటలకే తొలి రైలు పరుగులు ప్రారంభిస్తుందని తెలిపారు. నేటి నుంచే ఇది అమల్లోకి రానున్నట్టు హైదరాబాద్  మెట్రో రైలు (హెచ్ఎంఆర్) తెలిపింది.  తొలి రైలు ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుందని, చివరి రైలు రాత్రి 10.15 గంటలకు బయలుదేరి 11.15 గంటలకు చివరి స్టేషన్‌కు చేరుకుంటుందని వివరించింది.

ప్రస్తుతం తొలి రైలు ఉదయం ఏడు గంటలకు ప్రారంభం అవుతుండగా మరో గంటముందు తొలి రైలు అందుబాటులోకి వస్తే బాగుంటుందని అభినవ్ సుదర్శి అనే ప్రయాణికుడు మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ఆ సమయంలో మెట్రో స్టేషన్ల వద్ద వేచి చూస్తున్న ప్రయాణికుల వీడియోను పోస్టు చేశారు. దీంతో ఈ విషయాన్ని మంత్రి  మెట్రో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.  సానుకూలంగా స్పందించిన మెట్రో రైలు ఎండీ రైలు వేళ్లలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

  • Loading...

More Telugu News