Nani: బాల‌కృష్ణ 'అన్‌స్టాప‌బుల్'లో రెండో గెస్ట్ ఎవ‌రో చెప్పేసిన 'ఆహా'.. ఫొటోలు ఇవిగో

NameisNani  is second guest UnstoppableWithNBK Ep2 promo
  • మ‌న‌లో ఒక‌డు, సెల్ఫ్ మేడ్‌కి స‌ర్ నేమ్..
  • మ‌న రెండో గెస్ట్ నాని అని పేర్కొన్న‌ ఆహా
  • ఈ రోజు సాయంత్రం 5.04 గంట‌ల‌కు రెండో ఎపిసోడ్ ప్రోమో
'ఆహా'లో 'అన్‌స్టాప‌బుల్' పేరిట ప్రారంభ‌మైన సరికొత్త తరహా షోకు సినీ హీరో నంద‌మూరి బాల‌కృష్ణ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నెల 4న తొలి ఎపిసోడ్ ప్ర‌సార‌మైంది. ఈ షోకి తొలి గెస్ట్ గా మోహ‌న్ బాబు త‌న కుమార్తె మంచు ల‌క్ష్మి, కుమారుడు మంచు విష్ణుతో కలసి వ‌చ్చారు. రెండో ఎపిసోడ్‌లో వ‌చ్చేదెవ‌రనే విష‌యంపై అధికారింగా ఇప్పుడు ప్ర‌క‌ట‌న వ‌చ్చింది.
                 
'మ‌న‌లో ఒక‌డు, సెల్ఫ్ మేడ్‌కి స‌ర్ నేమ్.. మ‌న రెండో గెస్ట్ నాని' అని తెలుపుతూ ఆహా ప‌లు ఫొటోలు పోస్ట్ చేసింది. బాల‌కృష్ణ‌తో గేమ్ ఆడుతూ, చిరున‌వ్వులు చిందిస్తూ నాని క‌న‌ప‌డుతున్నాడు. ఈ రోజు సాయంత్రం 5.04 గంట‌ల‌కు రెండో ఎపిసోడ్ ప్రోమో విడుద‌ల అవుతుంద‌ని ఆహా త‌మ అధికారిక ట్విట్ట‌ర్‌లో పేర్కొంది.  
      
Nani
Tollywood
aha

More Telugu News