Keerthi Suresh: దూకుడు పెంచుతున్న కీర్తి సురేశ్ .. బన్నీ జోడీగా ఛాన్స్?

Keerthi Suresh in Allu Arjun movie
  • 'మహానటి' తరువాత తగ్గిన కీర్తి సురేశ్ దూకుడు
  • ప్లానింగ్ మార్చుకుంటూ ముందుకు  
  • రీసెంట్ గా 'సర్కారువారి పాట' పూర్తి
  • నాని సరసన 'దసరా' సినిమాలో ఛాన్స్
'మహానటి' వంటి మహత్తరమైన విజయాన్ని అందుకున్న కీర్తి సురేశ్ సరైన ప్లానింగ్ లేకపోవడం వలన కాస్త వెనకబడింది. మళ్లీ ఇప్పుడు ఆమె తన దూకుడు పెంచే పనిలో పడింది. మహేశ్ బాబు సరసన నాయికగా 'సర్కారువారి పాట' చేసిన ఆమె, ఆ తరువాత సినిమాగా నానీ 'దసరా' సినిమా చేయనుంది. ఇక అల్లు అర్జున్ జోడీగా కూడా ఆమెను సంప్రదిస్తున్నారనే వార్త ఇప్పుడు జోరుగా షికారు చేస్తోంది.
 
ప్రస్తుతం అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా షూటింగులో బిజీగా ఉన్నాడు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం డిసెంబర్ 17వ తేదీన థియేటర్లకు రానుంది. ఈ సినిమా తరువాత బోయపాటి దర్శకత్వంలో బన్నీ మరో మూవీ చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో .. గీతా ఆర్ట్స్ ద్వారా వచ్చిన 'సరైనోడు' ఘనవిజయాన్ని అందుకుంది.

దాంతో ఇప్పుడు అదే బ్యానర్ వారు బోయపాటి - బన్నీ కాంబినేషన్లో మరో ప్రాజెక్టును సెట్ చేశారు. ప్రస్తుతం 'అఖండ' సినిమా విడుదల పనుల్లో ఉన్న బోయపాటి, ఆ తరువాత బన్నీతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. అల్లు అరవింద్ - బన్నీ ఓకే చేసిన స్క్రిప్ట్ ఆయన దగ్గర సిద్ధంగా ఉందని అంటున్నారు. అయితే ఈ సినిమాలో కథానాయికగా కీర్తి సురేశ్ ను తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

టాలీవుడ్ లో టాప్ 3 హీరోయిన్స్ లో పూజ హెగ్డే .. రష్మిక .. కీర్తి సురేశ్ ఉన్నారు. పూజ హెగ్డేతో బన్నీ 'దువ్వాడ జగన్నాథం' .. 'అల వైకుంఠపురములో' సినిమాలు చేసేశాడు. ఇక రష్మికతో ప్రస్తుతం 'పుష్ప' సినిమా చేస్తున్నాడు. అందువలన బోయపాటితో చేయనున్న తాజా సినిమాలో కీర్తి సురేశ్ కు చోటు దక్కే అవకాశం ఎక్కువని అంటున్నారు.
Keerthi Suresh
Mahesh Babu
Allu Arjun

More Telugu News