Dharmana Krishna Das: పెట్రో ధరలపై ప్రజలకు మేలు చేసే నిర్ణయం తీసుకుంటాం: ధర్మాన కృష్ణదాస్

AP Deputy CM Dharmana Krishnadas opines in Petro Prices
  • బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చమురు ధరల తగ్గింపు
  • ఏపీ సర్కారుపైనా ఒత్తిడి
  • స్పందించిన డిప్యూటీ సీఎం
  • సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
ఇతర రాష్ట్రాల్లో పెట్రో ధరలు తగ్గిస్తుండడంతో ఏపీలోనూ తగ్గించాలంటూ విపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ స్పందించారు. పెట్రో ధరలపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రజలకు మేలు చేకూర్చేలా మంచి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

పెట్రో ధరలపై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడం హర్షణీయమని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో చమురుపై పన్నులు తగ్గించడంతో ఇతర రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతోంది. పెట్రో ధరలపై ఏపీ, తెలంగాణ తమ నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.
Dharmana Krishna Das
Petro Prices
Decision
YSRCP
Andhra Pradesh

More Telugu News